Weblog maken?


MaakEenWebsite.nl (tip)
Totaal slechts 10 euro per maand incl. domeinnaam en gratis overzetten van uw bestaande weblog bij Bloggers.nl 100 MB ruimte
emailadres
Lees meer..... en bestel
Gratis geld verdienen met e-mails lezen? Meld je aan bij
Zinngeld, Surfrace, Qassa en Euroclix !

Op zoek naar God?

telugu peoples


discuss every thing in telugu for telugu peoples around the world.

Home | Profile | Archives | Friends


మహేష్ బాబు, రాంచరణ్ ల మధ్య రీమేక్ పోటి నడుస&#

Posted at 11:06, 8/9/2015

మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడు ఘన విజయం సాదించిన విషయం ప్రేక్షకులకు విదితమే. ఇటీవలే తమిళం లో విడుదలైన థ్రిల్లర్ ‘తని ఒరువన్’ టాలివుడ్ లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా జయం రవి, నయనతార నటించారు. అరవింద స్వామి ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా విజయం సాదించింది. దీని ఫలితంగా కొంతమంది తెలుగు నిర్మాతలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నటుడు మహేష్ బాబు ఈ సినిమా చూసి బాగా ఆకర్షితుడయ్యాడట..!అతని సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమా కధ ఒక ఐపిఎస్ అధికారి చుట్టూ తిరిగే కధ అని ఇది తనకి సరిగ్గా సరిపోతుందని మహేష్ బాబు భావిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా రాంచరణ్ కూడా సరైన దర్శకుడు దొరికితే ఈ సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్నాడట…! దీనితో రీమేక్ కోసం మహేష్ బాబు, రాంచరణ్ ల మధ్య పోటి నడుస్తుంది. ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటిస్తారన్న విషయం అధికారిక సమాచారం వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదేమో…! ప్రస్తుతం మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తుండగా రాంచరణ్ ‘బ్రూస్లీ’ సినిమాలో నటిస్తున్నాడు.

source : http://www.teluguwaves.com/thani-oruvan-movie-remake-competition-between-mahesh-babu-ramcharan/

Hosting door HQ ICT Systeembeheer